Game Changer

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే!

Game Changer: శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన తాజా సినిమా ‘’గేమ్ ఛేంజర్‌’’ పొలిటికల్ ఆక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 2025 న.. నిన్న విడుదల అయింది. శంకర్, రామ్ చరణ్ కంబోలో వచ్చిన మొదటి సినిమాగా కావడంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాగా.. మొదటి రోజు రూ.186 కోట్లు వచ్చినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరోవైపు బుక్‌ మై షో ప్లేట్ ఫామ్ కూడా తొలి రోజు  1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ బుక్ అయినట్టు వెల్లడించింది. సంక్రాంతి పండగ ఉండడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ రామ్ నందన్ ఇంకా అప్పన్నగా రెండు పాత్రలు  చేసి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్కథ అందించారు. సముద్రఖని, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర మరియు అంజలి కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో రాంచరణ్ అప్పన్నగా చేసిన పాత్ర పైన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను నటించలేదు అందులో జీవించాడు అని అంటున్నారు. ఈ సినిమాలో ‘నానా హైరానా’ పాటను తొలగించినట్లు టీమ్‌ తెలిపింది. సాంకేతిక కారణాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. జనవరి 14 నుంచి ఈ పాట జోడిస్తామని వెల్లడించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mukkoti Ekadasi 2025: మోక్షాన్ని ప్రసాదించే వైకుంఠ ఏకాదశి.. దీని ప్రాశస్త్యం ఏమిటంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *