Anaparthi

Anaparthi: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండానే నియోజకవర్గానికి నిధులు వెల్లువ

Anaparthi: అనపర్తి నియోజకవర్గానికి 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి నల్లమిల్లి మూలారెడ్డి కుటుంబం ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తూ వచ్చింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ చివరి క్షణంలో పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించి మరో వ్యక్తికి సీటు ఇవ్వడంతో అనపర్తి పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు రామకృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఏదైనప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం నల్లమిల్లికి బ్రహ్మరథం పట్టారు.ఆయన గెలుపు కోసం ప్రజలు రోడ్డుపైకి వచ్చి మరీ పోరాటం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఎమ్మెల్యే సీటును దక్కించుకున్నారు.

ఎన్నికలు 20 రోజుల్లో ఉండగా కొత్త పార్టీ కొత్త గుర్తు ఎలా ఎదుర్కొంటారో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ 20వేల మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టి సారించారు.ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారుల ట్రాన్స్ఫర్ విషయంలో ఎటువంటి కరప్షన్ లేని ఏకైక ఎమ్మెల్యే, లిక్కర్ విషయంలో కనీసం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా నిజాయితీగా ముందుకు వెళ్లడం, ఇసుక పాలసీలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఒక నిజాయితీ గల ఎమ్మెల్యేగా నిరూపించుకున్నారంటూ అక్కడున్నటువంటి ప్రజలతో పాటు, వైసీపీ క్యాడర్ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారట…గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై పూర్తిస్థాయిలో పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎంక్వయిరీస్ కూడా నడుస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్‌గా కూడా కొంతమంది అధికారులు సస్పెండ్ అవుతున్నారు అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు.

Anaparthi: కూటమి అధికారం చేపట్టేసరికి రైతులు సాగునీరు అందక ఎదుర్కొంటున్న పూడికతీత సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి గోదావరి డెల్టాలో అత్యవసరంగా కాలువల్లో పూడికల తీతకు రూ. 20 కోట్ల నిధులు మంజూరు చేయించి తన సత్తా చాటుకున్నా ఏకైక ఎమ్మెల్యే నల్లమిల్లి అదే విధంగా నియోజకవర్గంలో రామవరం నుంచి రాయవరం వెళ్లే రోడ్డును గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కలెక్టర్ నిధుల నుంచి 1.50 కోట్ల నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. మరోవైపు వేమగిరి – సామర్లకోట రహదారి దుస్థితిపై ప్రతిపక్షంలో ఉండగా అనేక పోరాటాలు చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సుమారు 6:30 కోట్ల నిధులను మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులను ప్రారంభించారు.

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

ఇది కూడా చదవండి: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ వ్యూహాలు

అంతేకాకుండా రంగంపేట మండలంలో సుమారు రూ. 12 కోట్లతో రెండు రహదారులను పూర్తి చేశారు.  ఇక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. సామర్లకోట, వేమగిరి రహదారి నిర్మాణం కోసం అటు కేంద్రంతోను ఇటు రాష్ట్రంలోనూ అనేక పర్యాయాలు చర్చలు జరిపిన నల్లమిల్లి కెనాల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్న ఈ కాలంలో గత వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులను పూర్తి చేయడంతో నియోజకవర్గ ప్రజలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి జేజేలు పలుకుతున్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనపర్తిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కతాటిపై నడుస్తుండడం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పలువురు నేతలు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు బనాయించినప్పటికీ ఎక్కడ కక్ష రాజకీయాలు చేయకుండా న్యాయపరంగానే నేటికీ నల్లమిల్లి పోరాటం సాగిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కాకుండా సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే కాకుండా ఎవరికి కష్టం వచ్చినా క్షణాల్లో అక్కడికి చేరుకుని నేనున్నానంటూ ప్రజలకు ఆయన ఇస్తున్న భరోసాకు ప్రజలు ఫిదా అవుతున్నారు. మరోపక్క నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు పది దేవాలయాలకు 12 కోట్ల వరకు నిధులు మంజూరు చేయించడమే కాకుండా అనపర్తిని టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. రంగంపేట మండలంలో ఇప్పటికే జలసిరి పథకంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి ఐదుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు, జారీ చేసిన విషయం తెలిసిందే… నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసిన అనపర్తి డిప్యూటీ తాసిల్దార్ శశిధర్ సస్పెండ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే వైసీపీ నేతలకు కొమ్ము కాసిన అనేకమంది అధికారులు బలైపోయే అవకాశాలు నియోజకవర్గంలో మెండుగా కనిపిస్తున్నాయి.

Anaparthi: వచ్చే నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి తన సత్తా చాటుకునేందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడుగులు వేస్తున్నారు. గత వైసీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ అనుచరులపై ఉక్కుపాదం మోపి అక్రమ కేసులు అరెస్టులతో వేధించారు. అప్పటి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కేసు బనాయించి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించే పని చేశారు. రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. 

ALSO READ  MAHAA Vamsi Comment: మీరంతా ఎవరు మాట్లాడటానికి? వైసీపీ నేతలకు వైఎస్ విజయమ్మ సూటి ప్రశ్న!

వైసీపీ హయాంలో అభివృద్ధి ఏమి జరిగిందని ఇప్పుడు కూటమి హయాంలో ఏమి జరుగుతుందని ప్రజలు బేరేజి వేసుకుంటున్నారు. గత వైసీపీ పాలనలో ఎక్కడ సమస్యలు అక్కడే, ఉండిపోయాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా కొలిక్కి వస్తున్నాయి. 

రాజకీయాల్లో ఉన్న కుటుంబం రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి ఇక్కడ బాధ్యత వహించారు. వారసుడుగా ఎంట్రీ ఇచ్చి రామకృష్ణారెడ్డి తనదైన స్టైల్‌లో రాజకీయం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ, అనపర్తిలో వైసీపీ నాయకులకు, వైసీపీ అక్రమార్కులకు, నల్లమిల్లి ముచ్చమొటుల పట్టిస్తున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తూ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. ఇప్పటికీ అనపర్తి ప్రజల ఆశ నెరవేరిందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో అనపర్తి బంగారు బాటల నిలబోతుందనే దానికి ఇదే నిదర్శనం..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *