revanth redddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ వ్యూహాలు

Revanth Reddy: తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు లేదు అనుకున్న రోజుల్లో.. ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు.అయితే కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పదేళ్లలోనే సీన్ మార్చేశారు. కేసీఆర్‌కు తానే ధీటైన నేత అని నిరూపించారు. దీంతో ప్రజలు గత ఎన్నికల్లో ఆయన వైపు మొగ్గు చూపారు. దీంతో కేసీఆర్ బదులు సీఎం పీఠం ఆయన ఎక్కారు. ఒక వేళ రేవంత్ కాకపోతే కాంగ్రెస్‌కి కేసీఆర్‌కు ధీటైన నేత ఎవరూ లేరన్న అభిప్రాయం ఉండేది.2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అదే కారణమని… 2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ ధీటైన నాయకత్వం ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి ఇంకా యాభైల్లోనే ఉన్న నాయకుడు… ఆయన ఇప్పుడు సీఎంగా స్థిరపడిపోతే తెలంగాణలో ఆయనకు మించిన లీడర్ ఉండరు. ఈ విషయం రాజకీయాల్లో పండిపోయిన బీఆర్ఎస్ నేతలకు తెలియనిది కాదు. ప్రస్తుతానికి రేవంత్‌కు ఉన్న పవర్ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో ముడిపడి ఉంది. ఆయనను హైకమాండ్ వద్ద బలహీనపరిస్తే ఆటోమేటిక్‌గా తెలంగాణలోనూ బలహీనమవుతారని… అప్పుడు కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Congress: ఎమ్మెల్యే మ‌హిపాల్‌రెడ్డిపై శ్రీనివాస్‌గౌడ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Revanth Reddy: అందుకే రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని చూసుకుంటున్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డిపై విమర్శలతో పాటు పలు ఆరోపణలు చేస్తున్నారు. అమృత పథకం టెండర్ల విషయంతో పాటు తాజాగా జరిగిన లగచర్ల ఘటనపై ఢిల్లీ కేంద్రంగా ఫిర్యాదులు చేస్తూ…. రేవంత్ సర్కార్‌నీ ఇరుక్కున పెట్టే విధంగా బీఆర్ఎస్ పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతుంది.

బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ రెడ్డికి అర్థమై కాంగ్రెస్‌ని కాదని తనను టార్గెట్ చేస్తున్నారని… ఎదురుదాడికి దిగుతున్నారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్‌ని దెబ్బకొట్టాలని అనుకుంటున్నారని… అందుకే వరంగల్ సభలో రేవంత్ కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను బీఆర్ఎస్‌ను తొక్కకుంటూ వచ్చానని మరోసారి మొలకెత్తనీయనని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. తెలంగాణ రాజకీయం అంతా రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi Sanjay: స‌ర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *