Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేసిన తాజా బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో తనపై ‘నమ్మకద్రోహి’ అంటూ వైసీపీ కోటరీ చేస్తున్న దుష్ప్రచారానికి గట్టి కౌంటర్ ఇస్తూ.. సజ్జల రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు. పార్టీలో తాను ఎదుర్కొన్న తీవ్ర అవమానాలను, ప్లీనరీ వేదికగా జరిగిన భౌతిక దాడిని లేఖలో ప్రస్తావిస్తూ తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ప్లీనరీలో నాపై భౌతిక దాడి.. జగన్ కేవలం ప్రేక్షకుడు..
సజ్జల టీడీపీ కోవర్ట్.. నాపై అక్రమ కేసులు..
వైసీపీలో సజ్జల నంబర్ 1.. జగన్ నంబర్ 2
2019 విజయం తర్వాత సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ సభ్యులు ఎవరూ జగన్‌ను కలవకుండా మధ్యలో గోడ కట్టారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం వైసీపీలో నంబర్ 1 సజ్జల, నంబర్ 2 జగన్. ఆ కొత్త నంబర్ వన్‌కు సాష్టాంగ నమస్కారాలు పెట్టడం నా వల్ల కాదు” అని స్పష్టం చేశారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని వదులుకున్నానని, జగన్‌ను మోసం చేస్తూ తెరవెనుక కోవర్ట్ రాజకీయం చేయడం తనకు రాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రత్యక్ష పోరాటం చేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి మరిన్ని పూర్తి ఆధారాలతో నిజాలు బయటపెడతానని విజయసాయిరెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.
