Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలుకు వెళ్లారు. లగ్‌చర్లలో అధికారులపై దాడి ఘటనపై జైలులో రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు ములాఖత్ ద్వారా కలుసుకోవాలని బీఆర్ఎస్ బృందం జైలు అధికారులను కోరింది. కొంత ఆలస్యంగా అనుమతి ఇవ్వడంతో వారు జైలులో పట్నం నరేంద్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. హరీశ్‌రావు బృందంలో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.