Hyderabad: హైదరాబాద్‌లోని మరో శ్రీచైతన్య కళాశాలలో గురువారం మరో దారుణం చోటుచేసుకున్నది. నిజాంపేటలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి జస్వంత్ గౌడ్ తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తోటి విద్యార్థులు నిద్ర నుంచి లేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జస్వంత్ గౌడ్‌ను కళాశాల ఫీజు ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాలని యాజమాన్యం ఆదేశించడంతో, అంత ఒకేసారి చెల్లించే స్థోమత మా కుటుంబానికి లేదని సూసైడ్ లేఖ రాసినట్టు విద్యార్థులు తెలిపారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ఎదుట వివిధ విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో ధర్నా చేస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు.