Telangana:తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ 35 ఏండ్లుగా ఫోరోసిస్ రక్కసిపై వివిధ రూపాల్లో పోరాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు అంశుల స్వామి కూడా పుట్టుకతో ఫ్లోరైడ్ బాధితుడు.
Telangana:శివన్నగూడెం గ్రామంలో 4970 మంది ఉంగా, 320 మంది ఫ్లోరైడ్ పీడితులు ఉన్నారు. ప్లోరైడ్‌తో బాధపడుతూ ఇప్పటికే 30 మంది చనిపోయారు. దీంతో తన కుమారుడు స్వామితో కలిసి సత్యనారాయణ ఫ్లోరోసిస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు సత్యనారాయణ తన కొడుకు స్వామితో వెళ్లి కలిసి ఫ్లోరోసిస్ పీడనను కండ్లకు కట్టేలా వివరించారు.
Telangana:సత్యనారాయణ కుమారుడు అంశుల స్వామి 37 ఏడేండ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ 2022 జనవరి నెలలో మృతి చెందాడు. ఆయన మరణంతో సత్యనారాయణ మానసికంగా చాలా కుంగిపోయారు. ఎన్నో అనారోగ్యాలు దరిచేరాయి. రెండేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామమైన శివన్నగూడెం గ్రామంలోనే కన్నుమూశారు. ఆయన మృతితో ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాట యోధులు పలువురు చేరుకొని నివాళులర్పించారు. గ్రామంలో విషాదం అలుముకున్నది.