Anantapur: చేతిలో పది రూపాయలు కూడా లేదా.? ఇంట్లో భార్య పిల్లలలను ఎలా పోషించాలి అని భయపడుతున్నారా ? బ్రతకలేము చనిపోతాము అని ఆలోచిస్తున్నారా ? ఒక్క మాట..ఈ మాట విన్న తర్వాత మీ ఇష్టం. చనిపోయే అంత ఆలోచన నీకు వచ్చింది అంటే..బ్రతికే ఆలోచనలో కూడా ని మైండ్ లో ఉంది అని గుర్తు పెట్టుకో. డబ్బు ఎలా వస్తాయి అంటే..వస్తాయి..నిజంగా గుండెల్లో కన్న బిడ్డల కోసం నా కష్టం అని అడుగు ముందుకు వేయు…పరుగు పరుగున ..నోట్ల కట్టలు ని ముందు వచ్చి వాల్తాయి. పదా ,..ధైర్యం తో …ఇంటి నుంచి కదులు..నిన్ను ఎవడు ఆపేది.
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణం కలకలం రేపింది. భార్యాభర్తలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం కృష్ణ కిషోర్, భార్య శిరీష తమ ఐదు నెలల చిన్నారితో కలిసి పోలీస్‌స్టేషన్ సమీపంలోని సంతబజారులో నివాసం ఉంటుంన్నారు. ఐదు రోజుల నుంచి వారెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు.
Anantapur: ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు పక్క ఇంటి మిద్దెపై నుంచి ఇంట్లోకి చూశారు. తీవ్రమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఎస్సై సాగర్, ఆర్‌ఐ జ్యోతి, ఏఎస్సై నాగరాజు తదితరులు అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూశారు. భార్యా భర్తలిద్దరూ ఉరివేసుకొని ఉన్నారు.
ఉయ్యాలలో చిన్నారి విగతజీవిగా పడి ఉన్నాడు. ఆర్థిక సమస్యల వల్లే ఉత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. కిషోర్ మెడికల్ స్టోర్ నిర్వహించేవాడని ఈ క్రమంలో అప్పులు ఎక్కువయ్యాని స్థానికులు తెలుపుతున్నారు. వీరు ఆత్మహత్య చేసుకొని నాలుగైదు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.