Medipally Satyam: మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. ఆయన తేరుకొని లేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదే జిల్లాకు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.
Medipally Satyam: ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పిస్తుండగా, ఆమె విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తూలి కిందపడిపోయారు. అయితే వెంటనే తేరుకోగా, పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయనను పైకి లేపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో మళ్లీ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు.