Annamayya District: మేము ఇంతే ..నోట్లు ఇస్తే పని చేస్తాము…ఫ్రీ గా పని చేయమంటే ..బద్ధకం మాకు. బద్దకాన్ని బ్రాండ్ అంబాసిడర్లం మేము. అలాంటి వారి వద్దకు వెళ్లి…అయ్యా బాబు పని చేయండి సారూ అంటే ..ఎలా కదులుతారు. ? మీ పిచ్చి కాకపొతే . దేశాన్ని రక్షించడానికి నువ్వు ఎంత కష్టపడ్డా …వీళ్లకు మాత్రం ని పై కనికరం లేదు. అలా ఉంటది మరి మనతో…ఇంతకీ ఎవరు ఆ సార్లు…
అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో భూవనేశ్వర్ నగర్‌కి చెందిన మాజీ సైనికుడు రామచంద్ర కత్తితో గొత్తు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రామచంద్రకు 2007లో మదనపల్లె వెంకప్పకోట రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 89లో 2.30 ఎకరాలు మాజీ సైనికుల కోటా కింద స్థలం కేటాయించారు.
Annamayya District: అప్పట్లో రెవెన్యూ అధికారులు 1బీలో పేరు నమోదు చేశారు. దీంతో తగ కొన్ని నెలలుగా తన స్థలాన్ని రీసర్వేలో ఇటీవల జరిగిన 1బీలో తన పేరు తొలగించారు. దీంతో గత కొన్ని నెలలుగా తన స్థలాన్ని సర్వే చేసి 1బీలో తన పేరు ఎక్కించాలని కార్యాలయాల చుట్టు తిరుగుతున్నాడు.
ఇదే తరహాలో సోమవారం కూడా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయాలయానికి వచ్చాడు. తనతో పాటు తెచ్చిన కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు వన్ టౌన్ పోలీసులు బాధితపున్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీనిపై తహసీల్దార్ ని వివరణ కోరగా..రీసర్వే సమయంలో స్థలానికి సంబంధించి వివరాలు లేకపోవడంతో 1బీలో నమోదు కాలేదని, దీనిపై సర్వే అధికారులు నివేదిక ఇవ్వమని ఆదేశించామని తెలిపారు.