GV Prakash-Saindhavi: 11 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయింది జీవీ ప్రకాశ్, సైంధవి జంట. సంగీత దర్శకుడు జీవీ, గాయని సైంధవి కాంబోలో పలు హిట్ సాంగ్స్ వచ్చాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ లో పొరపొచ్చాలతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం జీవి ప్రకాశ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్నారు. విడాకుల తర్వాత వీరద్దరూ కలసి ఓ పాటను స్టేజ్ పాడి మెప్పించారు. ఈ సందర్భంగా ఆడిటోరియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ స్టేజ్ షో తో పాటు వీరు పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విడిపోకుండా ఉంటే వీరి కలయికలో ఇంకా ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చి ఉండేవి కదా అనే కామెంట్స్ వినవస్తున్నాయి. సంగీత దర్శకుడుగానే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నాడు జీవీ ప్రకాశ్. ఇటీవల ‘తంగలాన్, అమరన్, లక్కీభాస్కర్, మట్కా’ వంటి చిత్రాలకు పని చేసిన జీవీ సంగీతం అందించిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కావలసి ఉంది.
Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx
— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024