Erra Cheera: సుమన్ బాబు ప్రధాన పాత్రను పోషించి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎర్రచీర’. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, కరుణాచౌదరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. అయితే బిజినెస్ షో చూసిన పంపిణీదారులంతా ఈ సినిమాను హడావుడి పడకుండా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో విడుదల చేయాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలలో జాప్యం జరగొచ్చుకానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుందని నటుడు, దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.
vaaradhi:‘వారధి’మూవీ విడుదల ఎప్పుడంటే !
అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన సినిమా ‘వారధి’. శ్రీకృష్ణ దర్శకత్వంలో పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మించిన ఈ సినిమా ఇదే నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. కథానాయకి పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రం ఇదని, యువతను అట్రాక్ట్ చేసే లవ్, రొమాన్స్, ధ్రిల్లర్ సంఘటనలతో ఈ సినిమాను తీశామని దర్శకుడు శ్రీకృష్ణ తెలిపారు. నటీనటులు కొత్తవారైనా…. సహజంగా నటించారని, అందరి సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగామని చెప్పారు. భార్యభర్తల బంధాన్ని చాలా ఎమోషనల్ గా ఇందులో చూపించారని హీరో అనిల్ తెలిపారు. తమ చిత్రానికి సెన్సార్ సభ్యుల యు/ఎ సిక్స్ టీన్ ప్లస్ సర్టిఫికెట్ జారీ చేసినట్టు మేకర్స్ చెప్పారు.