EPS Pension: ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ (EPF), పెన్షన్ స్కీమ్ (EPS) కింద లెక్కించే జీతం లిమిట్‌ను ప్రభుత్వం రూ.15 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు పెంచింది. దీనివల్ల రిటైర్ అయిన తర్వాత నెలానెలా చేతికొచ్చే పెన్షన్ డబ్బులు దాదాపు 66 శాతానికి పైగా భారీగా పెరుగుతాయి.
అసలు పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
నెలవారీ పెన్షన్ = (జీతం లిమిట్ × పని చేసిన సంవత్సరాలు) ÷ 70
ఇంతకుముందు జీతం గరిష్ట పరిమితి రూ.15,000 మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని రూ.25,000 చేశారు.
ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఎవరైనా 20 ఏళ్లకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుంటే, వారికి అదనంగా మరో 2 ఏళ్లు బోనస్‌గా కలిపి పెన్షన్ లెక్కిస్తారు.
సర్వీస్ బట్టి పెన్షన్ ఎంత పెరుగుతుందంటే..
(బేసిక్ జీతం రూ.25 వేలు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి)
-
10 ఏళ్లు పనిచేస్తేపాత లెక్క ప్రకారం రూ.2,143 వచ్చేది.. ఇప్పుడు కొత్తగా రూ.3,571 వస్తుంది (నెలకు రూ.1,428 ఎక్కువ).
-
15 ఏళ్లు పనిచేస్తేగతంలో రూ.3,214 వచ్చేది.. ఇకపై రూ.5,357 అందుతుంది (నెలకు రూ.2,143 ఎక్కువ).
-
20 ఏళ్లు పనిచేస్తే (2 ఏళ్ల బోనస్‌తో కలిపి 22 ఏళ్లు)గతంలో రూ.4,714 వచ్చేది.. ఇప్పుడు నేరుగా రూ.7,857 వస్తుంది (నెలకు రూ.3,143 ఎక్కువ).
-
25 ఏళ్లు పనిచేస్తే (2 ఏళ్ల బోనస్‌తో కలిపి 27 ఏళ్లు)పాత పద్ధతిలో రూ.5,786 వచ్చేది.. ఇప్పుడు ఏకంగా రూ.9,643 చేతికొస్తుంది (నెలకు రూ.3,857 ఎక్కువ).
చిన్న ఉదాహరణ..
ఒకరి బేసిక్ జీతం నెలకు రూ.30,000 ఉండి, 20 ఏళ్లు ఉద్యోగం చేశారనుకుందాం. 2 ఏళ్ల బోనస్‌తో కలిపి మొత్తం 22 ఏళ్లు అవుతుంది.
-
పాత రూల్ ప్రకారం నెలకు రూ.4,714 మాత్రమే పెన్షన్ వచ్చేది.
-
కొత్త లిమిట్ వల్ల ఇప్పుడు అదే వ్యక్తికి నెలకు రూ.7,857 వస్తుంది.
-
అంటే ప్రతినెలా ఏకంగా రూ.3,143 ఎక్కువ పెన్షన్ జీవితాంతం అందుతుంది.
