National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమైన మలుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.
యంగ్ ఇండియా అనే కంపెనీ ద్వారా అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. సుమారు 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమ నగదు మార్పిడి (మనీలాండరింగ్) జరిగిందని ఈడీ తన అభియోగంలో పేర్కొంది. ఈ విషయంలో మరింత సమాచారం సేకరించడం కోసం సోనియా, రాహుల్‌లను విచారించడం అవసరమని ఈడీ కోర్టుకు తెలిపింది.
Also Read: Case on Pawan Kalyan: ఒక్క స్పీచ్‌తో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చాడా?
ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు మరికొందరిపై ఈడీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. యంగ్ ఇండియన్ సంస్థ అక్రమంగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను స్వాధీనం చేసుకుందని, దీని ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోర్టు ఈ ఈడీ అభ్యర్థనపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.