Eluru:మానవత్వం మంటగలిసింది అనడానికి ఇదే ఓ నిదర్శనం. ఇంతటి ఘోర కలి కథల్లో విన్నాము.. కానీ ఇప్పుడు కండ్లారా చూస్తున్నాము. బాలలపై అకృత్యాలు నిత్యకృత్యమవుతున్నా, ఇంతటి అమానుష ఘటన సమాజాన్ని కలిచివేస్తున్నది. ఇలాంటి కఠిన హృదయాలను తరచూ చూస్తున్నా, ఇది మరో రకమైన కఠినత్వంగా కనిపిస్తున్నది. పైశాచికత్వానికి పరాకాష్టగా నిలిచిందీ ఘటన.
Eluru:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు సమీపంలోని జంగారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఓ బాలుడిపై అతని మారుతండ్రి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టాడు. ఫోన్ చార్జింగ్ వైరుతో దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు ఆ మారుతండ్రి. ఆ తర్వాత కూడా తన పైశాకత్వం చల్లారక.. ఆ బాలుడి శరీరంపై ఉన్న గాయాలపై కారం చల్లి మరింత కాఠిన్యం ప్రదర్శించాడు.
Eluru:బాలుడి తల్లిదండ్రులకు గొడవు రావడంతో, బాలిడి తల్లి, కొడుకు, కూతురుతో కలిసి వేరుగా ఉంటున్నది. ఈలోగా ఓ హోటల్‌లో పనిచేసే వ్యక్తితో వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఆ వ్యక్తి, ఆ మహిళ, ఇద్దరు పిల్లలు కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. దీంతో తన వివాహేతర బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే అక్కసుతో అతనిలో రాక్షసత్వం జడలు విప్పుకున్నది. నిత్యం మద్యంతాగి వచ్చి కొడుతుండేవాడని, ఆ బాలుడి చెల్లిని కూడా దారుణంగా కొట్టేవాడని తెలిసింది.
Eluru: ఘటన జరిగిన రోజుకూడా కొట్టగా, దెబ్బలకు తాళలేక బయటకు పరుగులు తీశాడు. ఆ తర్వాత స్థానికులకు ఆ బాలుడు జరిగిన విషయం చెప్పుకోగా, సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్య చికిత్సలు జరుపుతున్నారు. శరీరంపై ఎక్కడా గ్యాప్ లేకుండా కొట్టిన దెబ్బలతకు రక్తందారులు కట్టింది. ఆ గాయాలపై కారం చల్లడంతో ఆ బాలుడు ఇప్పటికీ తల్లడిల్లిపోతున్నాడు. ఇది ఈ ఒక్కరోజే జరగలేదని, గత కొన్నాళ్లుగా ఇదే రీతిన తనను కొడుతున్నారని, కొట్టిన గాయాలపై కారం చల్లుతున్నారని ఆ బాలుడు గుక్కపెట్టి ఏడుస్తూ చెప్పడంతో అక్కడున్న వారు కూడా భోరున విలపించసాగారు. బాలుడిపై దాడిచేసిన ఆ దుర్మార్గుడికి సరైన శిక్ష పడాలని, పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.