Elon Musk: ఎలాన్ మస్క్ పేరు వినగానే స్పేస్ ఎక్స్, టెస్లా, ట్విట్టర్ (ఇప్పుడు X) గుర్తుకుతస్తాయి. కానీ ఈసారి ఆయన వేరే రంగంలోకి అడుగుపెట్టారు.. అది రాజకీయ రంగం! తన ప్రత్యేకమైన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మస్క్, ఇప్పుడు ఏకంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేశారు.
అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ
అమెరికాలో రెండు ప్రధాన పార్టీలే పాలిటిక్స్‌ను నడిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మస్క్ “అమెరికా పార్టీ” పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. “మీరు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం” అని మస్క్ అన్నారు. ఈ ప్రకటనను అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజే చేశారు.
ట్రంప్‌తో మస్క్ విభేదాలే కారణం?
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో ఎలాన్ మస్క్ సన్నిహిత సంబంధాల్లో ఒకప్పుడు ఉన్నారు. కానీ ఇటీవల ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అనే కీలక బిల్లుపై వీరిద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయగానే, మస్క్ పార్టీని ప్రకటించేశారు. ప్రజలకు మరో ప్రత్యామ్నాయాన్ని కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకొస్తోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Scorpion Sting Remedies: తేలు కాటు వేస్తే ఏం చేయాలి? ఆయుర్వేద వైద్యులు ఏమంటున్నారు..?
ప్రజల మద్దతుతో ముందుకు మస్క్ పార్టీ
తాను నిర్వహించిన ఓ సర్వేలో ప్రజలు 2:1 నిష్పత్తిలో కొత్త పార్టీ కావాలని ఓటేశారు. దీన్నే ప్రస్తావిస్తూ మస్క్ తన X అకౌంట్‌లో “ఇదే మీ స్వేచ్ఛ కోసం సరికొత్త ఆరంభం” అని చెప్పారు. ఆయన మాటల్లోనే.. “ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో కాదు.. ఏకపార్టీ పాలనలో బ్రతుకుతున్నాం. అందుకే అమెరికా పార్టీ అవసరమైంది.”
నెటిజన్లు పెట్టిన పేరు.. మస్క్ ఓకే!
నెటిజన్లు సూచించిన “ది అమెరికా పార్టీ” అనే పేరుకే మస్క్ కూడా అంగీకరించారు. దీంతో అధికారికంగా కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
మొత్తం గమనిస్తే:
అమెరికా రాజకీయాల్లో ఇది పెద్ద మార్పే. మస్క్ పార్టీ ఏర్పాటు చర్చనీయాంశమైంది. ఆయన స్టైలే వేరు.. అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By a factor of 2 to 1, you want a new political party and you shall have it!
When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.
Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN
— Elon Musk (@elonmusk) July 5, 2025