Eatala Rajendar: బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహోదగ్రుడయ్యారు. గత కొన్నాళ్లుగా పేదల భూముల కూల్చివేతలతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో కొందరు అక్రమార్కులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దందాలపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఈ దశలో ఆయన స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఓదారుస్తూ వస్తున్నారు.
Eatala Rajendar: ఈ దశలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా గురించి బాధితులు ఎంపీ ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఆయన వెంటనే తన అనుచరులతో కలిసి స్వయంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న బ్రోకర్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చెంప చెల్లుమనిపించారు. ఆ వెంటనే కార్యకర్తలు అతడిపై పడి పిడిగుద్దుల వర్షం కురిపించారు.
పేదల భూములు కబ్జా చేసినందుకే బ్రోకర్‌పై దాడి చేసినట్టు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. మేడ్చల్ మల్కాజిరిగిరి జిల్లా పరిధిలో జరిగే ఈ దందాకు ఇదో హెచ్చరిక లాంటిదని స్పష్టం చేశారు.