DSPs Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో, జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 36 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా పరమైన అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) సీవీ ఆనంద్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
లూప్ లైన్ నుండి క్రూషియల్ వింగ్స్‌కు..
తాజాగా బదిలీ అయిన అధికారులలో చాలా మందికి అత్యంత కీలకమైన విభాగాలలో పోస్టింగ్‌లు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక కమిషనరేట్లు, జిల్లాలతో పాటు సీఐడీ (CID), అవినీతి నిరోధక శాఖ (ACB), ఇంటెలిజెన్స్ (Intelligence) ఇంకా స్పెషల్ బ్రాంచ్ (SB) వంటి విభాగాలలో ఈ నూతన పోస్టింగ్‌లను కేటాయించారు. సైబరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట మరియు రామగుండం వంటి కీలక ప్రాంతాలలో ఈ బదిలీల ప్రక్రియ ప్రధానంగా సాగింది.
కొత్త పోస్టింగ్‌లు పొందిన ముఖ్య అధికారుల వివరాలు..
బదిలీల ఉత్తర్వుల ప్రకారం కొత్త బాధ్యతలు స్వీకరించనున్న కొద్దిమంది డీఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారుల జాబితా క్రింది విధంగా ఉంది:
తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు..
బదిలీల ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులు అందరూ తమ ప్రస్తుత బాధ్యతల నుండి వెంటనే రిలీవ్ అయి, తమకు కేటాయించిన కొత్త పోస్టింగ్‌లలో విధుల్లో చేరాలని డీజీపీ సీవీ ఆనంద్ తన ఉత్తర్వులలో ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని విభాగాల్లోనూ బదిలీలు ఉండే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
