Drinker Sai: ధర్హ, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ఈ మూవీతో కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీవసంత్ సంగీతం అందించారు.
ఇది కూడా చదవండి: Victory Venkatesh: అన్ స్టాపబుల్ కు విక్టరీ వెంకటేశ్ Shri Vinayaka Vijayam
Drinker Sai: ఈ నెల 27న సినిమా జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మరో పాటను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నువ్వు గుద్దితే… ‘ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. దీనిని జెస్సీ గిఫ్ట్ పాడారు. హీరోయిన్ ను టీజ్ చేస్తూ హీరో పాడే ఈ పాట మాస్ ను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి చెప్పారు.
జేజేలు అందుకున్న జయమాలిని
Jayamalini: జయమాలిని డాన్స్ అంటే ఆ రోజుల్లో జనానికి ఓ ఉత్సాహం ఉరకలు వేసేది. వాల్ పోస్టర్స్ లో జయమాలిని బొమ్మ చూసి థియేటర్లకు పరుగులు తీసేవారు. అంతకు ముందు జయమాలిని సోదరి జ్యోతిలక్ష్మి ఐటమ్ గాల్ గా రాజ్యమేలారు. జయమాలిని వచ్చాక అక్కను మించి అలరించారు. ఆరంభంలో నాజూగ్గా ఉన్న జయమాలిని తరువాతి రోజుల్లో బొద్దుగా తయారయింది. అయినా అభిమానులు జయమాలిని ఆటకు జేజేలు పలికారు. ఈ నాటికీ జయమాలిని సాంగ్స్ ఎక్కడైనా కనిపించగానే కళ్ళింతలు చేసుకొని చూస్తూంటారు ఆ నాటి అభిమానులు.
Jayamalini: అప్పటి టాప్ స్టార్స్ అందరి సరసన చిందేసి కనువిందు చేసిన జయమాలిని పెళ్ళయిన తరువాత సినిమాలకు దూరంగా జరిగారు. అయితేనేం ఆమె పాటలతో అభిమానులు పరమానందం చెందుతూనే ఉండడం విశేషం! తెలుగునాట ఎంతోమంది నృత్యతారలు వెలుగులు విరజిమ్మినా జయమాలిని అందరికన్నా మిన్నగా అలరించారని చెప్పవచ్చు. డిసెంబర్ 22న జయమాలిని బర్త్ డే… ఫ్యాన్స్ ఆమె ఆటాపాట స్మరించుకొని సంతోషించక మానరు.