Tirupati: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు శనివారం భూరి విరాళం అందజేశారు. ఆయన తన కుటుంబ సమేతంగా ఆయన ఈ విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందజేశారు. గతంలోనూ టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు ఆయన భారీగా విరాళాలను అందజేశారు. తాజాగా భారీ విరాళాన్ని అందజేయడం పట్ల ఆలయాధికారులు అభినందించారు.
Tirupati: చెన్నైకి చెందిన శ్రీవారి భక్తుడు వర్ధమాన్ జైన్ ఈ భూరి విరాళాన్ని అందజేశారు. రూ.6 కోట్ల మొత్తాన్ని టీటీడీ ట్రస్టుల కోసం అని ఆయన ఇచ్చారు. ఎస్‌వీబీసీ కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టు కోసం రూ.1 కోటి విలువైన డీడీలను ఆయన టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి స్వయంగా అందజేశారు. తిరుమల ఆలయ ఆవరణలోని రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం వర్ధమాన్ జైన్ కుటుంబ సభ్యులను సత్కరించారు.