dil raju

Dil Raju: అదంతా  ఫేక్.. సీఎం తో మీటింగ్ లో జరిగింది  ఇదే.. స్పష్టం చేసిన దిల్ రాజు 

Dil Raju: సీఎంతో మీటింగ్ లో నెగెటివ్ అంశాలు ఏమీ లేవు.. అంతా చాలా సజావుగా సాగింది అని చెప్పారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు. సీఎం తో భేట్ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయని తెలిపారు. సీఎం మీటింగ్ లో అసలు జరగని వి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగింది. దీనిలో 0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు అని దిల్ రాజు స్పష్టం చేశారు. 

సీఎం సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదు అని దిల్ రాజు అన్నారు. చాలా మీడియాలలో ప్రచారం జరుగుతున్నట్టుగా పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదని చెప్పారు. 

Dil Raju: అలాగే, బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.

సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు. అంతేకాకుండా అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన మీటింగ్ ప్రధానమైన అంశాలు ఇవే. అంతేకానీ, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు నెగెటివ్ గా ఏమీ జరగలేదు అని దిల్ రాజు వివరించారు. 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral News: ఆఫర్ అదిరింది.. యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్స్ చేయండి.. సమోసాలు తినండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *