Dhee Raju Arrested:

Dhee Raju Arrested: ‘ఢీ 10’ విన్నర్ రాజు అరెస్ట్..?

Dhee Raju Arrested: బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ‘ఢీ 10’ విన్నర్ రాజు ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే తీవ్రమైన ఆరోపణలతో ఆయన కటకటాల పాలయ్యాడు. అయితే, ఈ కేసులో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అత్యంత సంచలన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఒక సెలబ్రిటీపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా ఉంచడం.

డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఒక యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

యువతి ఫిర్యాదుతో స్పందించిన మియాపూర్ పోలీసులు ఈ నెల 9న రాజుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి చర్యల్లో భాగంగా అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి వెంటనే రిమాండ్‌కు తరలించారు. సాధారణంగా ఒక ప్రముఖ టీవీ షో విన్నర్, లేదా సెలబ్రిటీపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే ఆ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపిస్తుంది.

పోలీసులు సైతం వివరాలను మీడియాకు వెల్లడిస్తారు. కానీ, రాజు కేసులో మాత్రం మియాపూర్ పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 9వ తేదీనే కేసు నమోదు చేసి, అతన్ని రిమాండ్‌కు పంపినప్పటికీ.. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు చాలా జాగ్రత్త పడ్డారు. ఇన్ని రోజుల పాటు ఈ కేసు వివరాలను సీక్రెట్‌గా ఉంచడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజు జైలులో ఉండగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇటు బుల్లితెర వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసును పోలీసులు ఎందుకు దాచాల్సి వచ్చిందన్న దానిపై ఉన్నతాధికారులు స్పందిస్తే కానీ అసలు నిజాలు బయటకు రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *