delhi: ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?

delhi: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. పాక్, పీఓకేలోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అనే పేరు పెట్టడానికి కారణం ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణం. ఆ దాడిలో 26ఏళ్ల నేవీ అధికారి వినయ్ హత్యకు గురయ్యాడు. పెళ్లైన ఐదు రోజుల్లోనే అతని భార్య హిమాన్షి గుండెలవిసేలా విలపించిన దృశ్యం దేశాన్ని కదిలించింది. ఉగ్రదాడిలో అనేకమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అనే పేరుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబాలు భారత్ చర్యపై హర్షం వ్యక్తం చేశాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adulterated Milk: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? పాలను కల్తీ చేసినట్లు ఇలా గుర్తించవచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *