Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మూడవ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పటేల్ నగర్ నుండి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఓఖ్లా నుండి అరిబా ఖాన్ పోటీ చేయనున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ పాల్ లక్డా ముండ్కా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే పటేల్ నగర్ స్థానానికి కృష్ణ తీరథ్ నామినేషన్ దాఖలు చేశారు. గోకల్‌పూర్ నియోజకవర్గంలో ప్రమోద్ జయంతి స్థానంలో ఈశ్వర్ బగ్రీకి టిక్కెట్ ఇచ్చారు. అలాగే, రాజేష్ గుప్తా కిరారీ నుండి, కున్వర్ కరణ్ సింగ్ మోడల్ టౌన్ నుండి, జగత్ సింగ్ షహదారా నుండి, రాజీవ్ చౌదరి విశ్వాస్ నగర్ నుండి,