Daaku-mahararaj: కింగ్ ఆఫ్ సంక్రాంతి.. బాలయ్య నయా రికార్డ్..

Daaku-mahararaj: నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 105 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. దీనిపై చిత్ర నిర్మాతలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటన చేశారు.

“కింగ్ ఆఫ్ సంక్రాంతి” అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాక, ఈ చిత్రాన్ని రేపు తమిళంలో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక మొదటి రోజైన ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 56 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాలయ్య కెరీర్‌లోనే అత్యంత పెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘డాకు మహారాజ్’ నిలిచింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ap news: గుడ్ న్యూస్ ఎంత మంది పిల్లలున్న సర్పంచ్ కి పోటీ చేయచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *