SBI Bank: నైట్ నైట్ …మొత్తం కోటి. కొట్టేశామా..కోటీశ్వరులం ఐపోయామా ? ఇలా ఉండాలి దెబ్బ. కూర్చుని కష్టపడితే ఏమి వస్తుంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి ఇలా. కాని..ఒక్కటే జైలు కూడా ఉంటుంది అనుకోండి. అది వేరే సంగతి. జైలుకు వెళ్ళాలి. పోలీసుల లాటి దెబ్బలు తినాలి. కోర్ట్ చుట్టూ తిరగాలి. సమాజంలో తల ఎత్తుకోకుండా తిరగాలి. ఇవన్ని ఉంటాయి . అందుకే చెప్పేది పెద్దోళ్ళు. కష్టపడి పని చేసిన పది రూపాయలైన గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు హాయ్ గా అని
వరంగల్ జిల్లాలో భారీ దొంగతనం వెలుగుచూసింది. చిన్నా, చితక చోరీలతో సరిపోవడం లేదని ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు కేటుగాళ్లు. దాంతో.. లబోదిబోమంటూ బ్యాంకులకు పరుగులు పెట్టడం ఖాతాదారుల వంతైంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఏడాది క్రితం చోరీకి దొంగలు విశ్వప్రయత్నం చేశారు. కానీ.. అప్పుడు చోరికి వీలవలేదు. కానీ.. ఘటన విషయం తెలిసిన తర్వాత కూడా అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో.. వీలుచూసి భారీ చోరికి పాల్పడ్డారు దొంగలు. దాంతో.. ఇప్పుడు తలలు పట్టుకోవడం బ్యాంకు అధికారుల వంతైంది.
ఇది కూడా చదవండి: Agra: భార్యపై అత్యాచారం చేయించిన భర్త..
SBI Bank: మండల కేంద్రంలోని ఎస్ బీఐ బ్యాంకు నిర్వహణ లోపాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు. బ్యాంకుకు కన్నం వేశారు. పైగా.. సొరుగుల్లో సొమ్ముల జోలికి వెళ్లకండూ.. ఏకంగా బంగార ఉన్న లాకర్లనే టార్గెట్ చేసుకున్నారు. సినిమా ఫక్కిలో సాగిన ఈ చోరి కథ.. పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి ముందస్తు ప్లాన్ తో, ఎలాంటి ఆధారాలు లభించకుండా.. చాలా జాగ్రత్తగా సొమ్ముల్ని అపహరించుకుపోయారు.
చాన్నాళ్లుగా బ్యాంకు దగ్గర రాత్రి వేళల్లో సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించిన దొంగలు.. బ్యాంకును లక్ష్యంగా చేసుకున్నారు. బ్యాంకుల్లోని సెక్యూరిటీ ఆలారం పనిచేయకుండా.. ముందస్తుగా.. అలారం తీగలను కత్తిరించారు. అక్కడి నుంచి చిన్నగా.. కిటికీని తొలగించి బ్యాంకు లోపలికి చొరబడిన దొంగలు.. సీసీ కెమెరాలను వెతికి మరీ తొలగించారు. వాటి వైర్లను కత్తిరించి.. సాంకేతికత ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు పడ్డారు. ముందుగా వారి కదలికలు, ఎలాంటి అలారాలు మోగకుండా చూసుకున్న తర్వాత.. వారి అసలు పని కానిచ్చారు.
బ్యాంకులోని బంగారు లాకర్లను తెరవడం అంత సులభం కాదు. అందుకే.. పక్కా ప్రణాళికతో వచ్చిన దుండగులు.. గ్యాస్ కట్టర్లను సైతం వెంటబెట్టుకుని వచ్చారు. బ్యాంకులో మొత్తం మూడు లాకర్లు ఉండగా.. వాటిలో ఒకదానిని తెరచి, అందులోని మొత్తం బంగారాన్ని కాజేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లాకరులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారాన్ని దాచినట్లు తెలుస్తోంది. ఈ లాకర్ లోని 497 సీజ్ చేసిన ప్యాకెట్ల నుంచి దాదాపు..19 కేజీల అభరణాల్ని ఎత్తుకెళ్లారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. వీటి విలువ రూ.15 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు.