Crime News:పిల్లల్లో రానురాను సున్నితత్వం పెరుగుతున్నది.. సమాజ స్థితిగతులు.. తల్లిదండ్రుల పెంపకమూ అదే నేర్పుతున్నది. ఫలితంగా ఎందరో బాలలు క్షణికావేశాలకు లోనవుతున్నారు. ఏంచేస్తారో వారికే తెలియదు.. ఏం జేసుకుంటున్నారో అని అర్థమే కాదు.. చివరకు తల్లిదండ్రులే సఫర్ కావాల్సి వస్తున్నది. ఇటీవల కాలంలో పిల్లల్లో ఆ మంకు ఇంకా మితిమీరుతున్నది.
Crime News:హైదరాబాద్ నగర పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలో ఓ 16 ఏళ్ల బాలుడు ఇటీవలే పదో తరగతి పరీక్షల్లో ఓ సబ్జెక్టు ఫెయిలై ఇంటి వద్దే ఉంటున్నాడు. సప్లిమెంటరీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా పరీక్షల కోసం చదువుకోకుండా తరచూ మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. ఇదే విషయమై ఆ బాలుడిని అతని తల్లి మందలించింది. చదువుకోకుండా, ఆ వీడియో గేమ్స్ ఏమిటి? అని నిలదీసింది.
Crime News:అదే ఆ బాలుడికి మనస్తాపం తెచ్చింది. క్షణికావేశానికి లోనయ్యాడు. వెంటనే తన ఇంటి బిల్డింగ్‌పైకి వెళ్లాడు. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఎప్పుడూ అన్నట్టే తల్లి తన కొడుకు మేలు కోరుకున్నది. అతను చెడిపోవాలని భావించలేదు. కానీ, ఇక్కడ ఆ బాలుడు అర్థం చేసుకున్నది మాత్రం.. తనను తిట్టిపోసిందని అనుకున్నాడు. తనువు చాలించాడు.
Crime News:ఇటీవల పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనోవేదనతో ఎందరో బాలలు మధ్యలోనే జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఎంతో భావి జీవితాన్ని మధ్యలోనే అకారణంగా వదిలేస్తున్నారు. తోటి స్నేహితుల మధ్య చులకన అవుతామని, బంధుమిత్రుల వద్ద హేళన అవుతామని భావించిన ఎందరో ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. దీనికంతటికీ కారణం.. తల్లిదండ్రుల అతి గారాభం.. బోధనల్లో సామాజిక బాధ్యతలు నేర్పకపోవడం.. సమాజంలో ఆ భావనలు తెలియకపోవడమేనని మానసిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.