Crime News: మూఢనమ్మకాలు మనుషులను అధోగతి పాలు చేస్తున్నాయి. అవి అపనమ్మకాలు అని తెలిసినా ఎందరో పాటిస్తూ వస్తూనే ఉన్నారు. కొందరు వద్దని చెప్పినా తేలికగా తీసిపారేస్తున్నారు. ఎవరో చెప్పిన మూఢ విషయాలను పాటిస్తూ ప్రాణాల మీదికే కొనితెచ్చుకుంటున్నారు. ఇలా ఎందరో నష్టాలపాలై కుటుంబాలకు కుటుంబాలే నష్టపోయిన ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.
Crime News: ఆదిలాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఇతరులకు కనువిప్పు కలగాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన ప్రవళికను మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఆ యువతి గర్భందాల్చింది. పండంటి బిడ్డను కనాలని, పెంచి పెద్ద చేయాలని ఆ యువతి కలలు కంటూ ఉన్నది.
Crime News: ఇదే సమయంలో నూతన ఇంటి నిర్మాణ పనులను ఆ దంపతులు చేపట్టారు. ఇంటి నిర్మాణ సమయంలో ప్రవళిక గర్భందాల్చడం అరిష్టమని ఆమె భర్త భావించాడో, ఎవరైనా సలహా చెప్పారో ఏమో కానీ మూఢనమ్మకాలను గాఢంగా నమ్మాడు. ఏదైతే అది అవుతుందని గర్భం విచ్ఛితికే మొగ్గు చూపాడు. కనిపెంచాలనుకున్న ప్రవళిక కలలను చిదిమేయాలని భావించాడు.
Crime News: గర్భస్రావం చేసుకునేందుకు ప్రవళిక తొలుత అంగీకరించలేదు. పండండి బిడ్డను కనిపెంచాలని తన కోరికను బలంగా చెప్పుకున్నది. కానీ, భర్త మాటలు, సొంతింటి కల నెరవేరుతుందని భావించి, మరోసారైనా అవకాశం ఉంటుంది కదా అని భావించింది. ఆ తర్వాత ఏకంగా ప్రవళికతో అబార్షన్ మాత్రలను మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది.
Crime News: చికిత్స నిమిత్తం ప్రవళికను ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ప్రవళిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: ఇక్కడ ఆ దంపతులకు అంతా మంచే జరుగుంది. ఒకవైపు ఇల్లు కట్టుకుంటున్నారు, మరోవైపు పండంటి బిడ్డ కడుపులో పెరుగుతూ వస్తున్నది. కానీ, ఎవరో చెప్పిన చెడు మాటలు విని మూఢనమ్మకాలతో ప్రవళిక కడుపులో ఉన్న గుడ్డును చిదిమేయాలని భావించారు. కానీ, ఆ ఇంటి దీపమే ఆరిపోయింది. ఆ మూఢనమ్మకాలు పాటించకుంటే ఆ కొత్త ఇంటిలో భార్యా పిల్లలతో హాయిగా కాపురం చేసేవారు కదా.. అని స్థానికులు, బంధు మిత్రులు అభిప్రాయపడుతున్నారు.