Viral Video: బెంగళూరు లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కాఫీ షాప్‌కు వెళ్లిన ఇద్దరు కస్టమర్లు అదనపు కాఫీ కప్పు ఇచ్చేందుకు నిరాకరించిన సిబ్బంది పై దాడి చేశారు. ఈ ఘటన శేషాద్రిపురం లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
శేషాద్రిపురంలోని నమ్మ ఫిల్టర్ కాఫీ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే, నిన్న సాయంత్రం 6:50 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు కాఫీ తాగేందుకు కేఫ్‌కు వెళ్లారు. వాళ్లు సిబ్బందిని ఎక్స్‌ట్రా కాఫీ కప్పు అడిగారు. అందుకు సిబ్బంది నిరాకరించారు. రెస్టారెంట్ రూల్స్ ప్రకారం అదనపు కప్పు ఇవ్వమని చెప్పారు. కావాలంటే ఇంకో కప్పు కాఫీ కొనాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన కస్టమర్లు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. కప్పు నిరాకరించిన వ్యక్తిని దుర్భాషలాడి అతడిపై దాడి చేశారు. తల, ముఖంపై దారుణంగా కొట్టారు. బయటికి లాక్కొచ్చి కడుపులో తంతూ తీవ్రంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై శేషాద్రిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Shocking: A staffer at Namma Filter Coffee, Bengaluru, was assaulted after denying an extra cup per café policy.
CCTV shows him being punched & kicked by a group of men.
The incident occurred at 6:50 PM in Seshadripuram. Police complaint filed. #JusticeForStaff pic.twitter.com/F8EwYMmtkJ— Jeetwin News (@JeetwinNews) July 3, 2025