Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ సంస్కృతులు, దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. న్యూఢిల్లీలో జరిగిన ఓ జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీజేపీ నేతలు ఎప్పుడూ ‘జై శ్రీరామ్’ మాత్రమే అంటారని, ప్రధాని మోదీ ఎప్పుడైనా ‘హర హర మహాదేవ్’ అని నినాదం చేశారా అని ప్రశ్నించారు. శివుడు పేదల దేవుడని, శ్రీరాముడు సంపన్నుల దేవుడని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మేం ద్రావిడులం.. వాళ్లు ఆర్యులు.. రేవంత్ వ్యాఖ్యల సారాంశం..
“మేం దక్షిణ భారతానికి చెందిన వారం. మాది ద్రావిడ సంస్కృతి, వారిది ఆర్య సంస్కృతి. మేం శివ భక్తులం, వారు రామ భక్తులు. శివుడు పేదల దేవుడు, శ్రీరాముడు సంపన్నుల దేవుడు. బీజేపీ సంపన్నుల పార్టీ కాబట్టే శ్రీరాముడి జపం మాత్రమే చేస్తుంది” అని రేవంత్ అభివర్ణించారు. అయితే ప్రజలు ఇద్దరు దేవుళ్లను సమానంగా ఆరాధిస్తారని చెప్పారు.
తెలంగాణలో వేములవాడను దక్షిణ కాశీగా, భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా సమానంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తారని, అలాంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఉత్తర-దక్షిణాది పేరిట విడదీసి మాట్లాడటం రేవంత్ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
