CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఈ రోజు (మార్చి 9) మధ్యాహ్నం పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వాస్తవంగా ఈ రోజు ఉదయమే ఆయన బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఢీల్లీకి ఎవరూ రావద్దని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఫోన్ ద్వారానే తాము సమాచారం ఇస్తామని తేల్చి చెప్పాయి. అదే విధంగా ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో అందుబాటులో లేరనే కారణంతో రేవంత్ ఢిల్లీ పర్యటన ఉదయం ఆగిపోయింది.
CM Revanth Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయమై ఖరారు చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. దీంతో ఆయన హుటాహుటిన బయలుదేరి వెళ్లనున్నారు. ఇదేరోజు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సాయంత్రంలోగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 39వ సారి కావడం గమనార్హం. ఈ విషయమై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.