Cm revanth: జపాన్ పర్యటనకు సీఎం రేవంత్..

CM revanth: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటన ఏప్రిల్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమా వంటి ప్రముఖ నగరాలను సందర్శించనున్నారు.

ఈ పర్యటనలో ముఖ్యమైన భాగంగా, ఒసాకాలో నిర్వహించనున్న వరల్డ్ ఎక్స్‌పో–2025 లో తెలంగాణ రాష్ట్ర పెవిలియన్‌ ప్రారంభం జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.

ఈ భేటీల్లో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పర్యటన ఉపయోగపడనుందని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ పరిశ్రమల వృద్ధికి, గ్లోబల్ బ్రాండింగ్‌కు ఈ పర్యటన దోహదపడుతుందనిఅంచనా.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sugarcane Juice: వీళ్లు చెరకు రసం అస్సలు తాగకూడదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *