CM Chandrababu: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి… కడప జిల్లాలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి జగన్ వెంట నడిచిన తర్వాత టీడీపీ గూటికి చేరారు. 2014 వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి పదవి కొట్టేశారు. 2014 నుంచి జగన్ సొంత జిల్లాలో వైసీపీపై ఒంటి కాలిపై లేచే నేతల్లో ఆది నారాయణ ముందు వరుసలో ఉంటారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ గూటికి చేరి తన రాజకీయ చతురతతో జగన్‌ని ఎదుర్కొన్నారు.
ఆది నారాయణ బీజేపీ గూటికి చేరిన కుటుంబం మాత్రం టీడీపీలోనే ఉండేలా ప్రణాళిక చేసుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కలయికతో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దేవగుడి కుటుంబంపై సత్తా చూపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆది నారాయణ తన మార్క్ రాజకీయంతో నియోజకవర్గం అభివృద్ధితో పాటు క్యాడర్ విషయంలోను ముక్కుసూటిగా పోతున్నారట.జమ్మలమడుగులో అభివృద్ధి పనుల్లో తమ అనుచరులకు భాగం ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేశారట. అదే ఇప్పుడు వివాదాలకు దారితీస్తుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: Ajmer Sharif Dargah: అజ్మీర్ దర్గాలో ఆలయం.. పిటిషన్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్
CM Chandrababu: జమ్మలమడుగులో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రముఖ అదానీ సంస్థ ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేసింది. సబ్ కాంట్రాక్టు ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ పనులు చేస్తుండగా ఎమ్మెల్యే ఆది నారాయణ అనుచరులు అడ్డుకున్నారట.మా నియోజకవర్గంలో మా అనుచరులకు కాంట్రాక్టు పనులు ఇవ్వకుండా వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేయడం వివాదంగా మారింది. ఇప్పుడు యర్రగుంట్ల మండలం కలమళ్ళ వద్ద ఉన్న రాయలసీమ థర్మల్ తాప విద్యుత్ కేంద్రంలో ఫ్లై యాష్ వివాదంలో ఆది నారాయణ వేలు పెట్టారు.
ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ తమ నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీలకు ఇక్కడ నుంచి బూడిద తీసుకెళ్తున్నారు. కూటమి ఏర్పాటు తర్వాత ఇక్కడ ఒప్పందం చేసుకొని ప్లై యాష్ రవాణా చేస్తున్నారు.అయితే ఇక్కడ ఆర్టీపీపీ కోసం భూములు కోల్పోయిన స్థానికంగా ఉన్న రైతులకు ప్లాంట్ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తం చెల్లించకుండా జేసీ బూడిద తరలిస్తున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇదే అంశంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట… రైతులకు డబ్బులు చెల్లిస్తేనే జేసీ వాహనాలను అనుమతించాలని..