Cigarette Prices Soar

Cigarette Prices Soar: సిగరెట్లపై 40 శాతం జీఎస్టీ.. ఇపుడు రూ.10 సిగ్రేట్ ఎంతో తెలుసా..?

Cigarette Prices Soar: మొన్నటికి వరకు ఒక్కొక సిగ్రేట్ ధర 72 రూపాయలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 ప్రభావం ధూమపానం చేసేవారిపై గట్టిగానే పడబోతోంది. దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులు మరియు సిగరెట్లపై ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు నిన్నటి నుండే (ఫిబ్రవరి 1) అమలులోకి వచ్చాయి.

పన్ను విధానంలో మార్పులు

గతంలో సిగరెట్లపై కేవలం 28 శాతం జీఎస్టీ మరియు కొంత పరిహార సెస్ మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు పాత పద్ధతిని రద్దు చేసి, ప్రభుత్వం మరిన్ని కొత్త పన్నులను జోడించింది. దీని ప్రకారం ఇకపై ప్రతి సిగరెట్‌పై ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య మరియు జాతీయ భద్రతా సెస్‌తో పాటు ఏకంగా 40 శాతం జీఎస్టీ వర్తించనుంది. ఈ మార్పుల వల్ల సిగరెట్ల ధరలు ఒక్కసారిగా భారమయ్యాయి.

ఇది కూడా చదవండి: UP crime : తొమ్మిదేళ్ల ప్రేమ.. రెండు నెలలకే అంతం.. ఎంతకు తెగించిందంటే?

మీ జేబుపై పడే భారం ఎంత?

సాధారణంగా దొరికే సిగరెట్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు ధరల పెరుగుదల ఇలా ఉంది:

  • సాధారణ సిగరెట్: గతంలో రూ. 10 కి లభించిన ఒక సిగరెట్ ధర ఇప్పుడు రూ. 12 నుంచి రూ. 13 కి చేరింది. అంటే ఒక్కో సిగరెట్‌పై రూ. 2 నుంచి రూ. 3 వరకు భారం పెరిగింది.
  • సిగరెట్ ప్యాకెట్: 10 సిగరెట్లు ఉండే ప్యాకెట్ ధర గతంలో రూ. 100 ఉండగా, ఇప్పుడు అది రూ. 130 నుంచి రూ. 140 వరకు పెరిగింది.
  • ప్రీమియం బ్రాండ్లు: ఖరీదైన సిగరెట్లపై పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. ఒక్కో సిగరెట్‌పై రూ. 3.6 నుంచి రూ. 4 వరకు ధర పెరిగింది.

ప్రభుత్వం ఆరోగ్య కారణాల దృష్ట్యా మరియు ఆదాయ వనరులను పెంచుకోవడానికి పొగాకు ఉత్పత్తులపై ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సామాన్య మరియు మధ్యతరగతి ధూమపాన ప్రియుల నెలవారీ ఖర్చులు పెరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *