AP news: మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణ..

AP news: గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా విధులు నిర్వర్తించిన సునీల్ కుమార్ పై అనేక అధికార దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సునీల్ కుమార్ పై విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ అథారిటీలో ఇద్దరు విచారణ అధికారులను నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మరియు విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా ఈ అథారిటీలో విచారణ అధికారులుగా వ్యవహరిస్తారు. సునీల్ కుమార్ పై విచారణ పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  YSRCP: విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ రియాక్షన్ ఇదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *