The Odyssey Trailer: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ది ఒడిస్సీ’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ థియేటర్లలో సందడి చేస్తోంది. హోమర్ రాసిన పురాతన గ్రీకు ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఈ టీజర్ ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ స్క్రీనింగ్‌లలో ప్రదర్శితమవుతూ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. టామ్ హాలండ్, జోన్ బెర్న్‌థాల్, జెండాయా, ఆనీ హాత్‌వే వంటి స్టార్ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సుమారు 250 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలై 17న విడుదల కానుంది. నోలన్ గత చిత్రం ‘ఓపెన్‌హైమర్’ లాంటి విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
I have witnessed #TheOdysseyMovie teaser trailer…it’s beautiful 😭😭 thank you @RegalMovies !! #theodyssey #odyssey pic.twitter.com/uWfYn8kbaS
— Kyzo Films (@KyzoFilms) July 2, 2025