PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దేశ భద్రతను మరింత బలపరిచే ఉద్దేశంతో రూపొందించిన అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్-09 (రీశాట్-1బీ) ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి మే 19వ తేదీ, ఆదివారం ఉదయం 5:59 గంటలకు ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్నారు.
శనివారం ఉదయం 7:59 గంటల నుంచి ప్రారంభమయ్యే 22 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ మహాప్రయోగం షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదికపై నుంచి జరగనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. శుక్రవారం రాకెట్‌కు తుది పరీక్షలు నిర్వహించి, ప్రయోగానికి సిద్ధం చేశారు.
ఇది కూడా చదవండి: Brahmos Missiles: పాకిస్తాన్ కు దడ పుట్టిస్తున్న బ్రహ్మోస్.. దెబ్బ ఇలానే ఉంటది
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. నారాయణన్ స్వయంగా శ్రీవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో శాస్త్రవేత్తలతో కలిసి దర్శనం చేసుకొని, రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. ఇదే రోజు సాయంత్రం షార్‌కు తిరిగి చేరిన నారాయణన్, రాకెట్ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఇంతకు ముందు జనవరిలో జరిగిన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహ ప్రయోగంలో ఎదురైన సాంకేతిక సమస్యల నేపథ్యంలో, ఈసారి ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలించి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయోగానికి సంబంధించి జరిగిన మిషన్ రెడినెస్ రివ్యూ (MRR), అలాగే లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (LAB) సమావేశంలో రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈవోఎస్-09 ఉపగ్రహం భారత్‌కు సరిహద్దు భద్రత, విపత్తుల నిర్వహణ, వ్యవసాయ పరిశీలన వంటి అనేక రంగాల్లో కీలక సమాచారం అందించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ రక్షణ రంగానికి మరో కీలక బలగంగా నిలవనుంది.