Pawan Kalyan: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు దాస్య శృంఖలాలతో స్వేచ్ఛకు దూరమైన సమాజంలో పోరాట జ్వాలలు రగిలించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆ వీరుడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగిన, పోరాట పంథాను ఎంచుకున్న అల్లూరి సీతారామరాజు ధైర్యం చిరస్మరణీయం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు జాతి పౌరుషానికి, ధైర్యానికి మన్యం వీరుడు అల్లూరి ప్రతీకగా నిలిచారని ఆయన ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు చూపిన స్ఫూర్తిని, ఆయన త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
