Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి దావోస్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ 20 నుంచి 24 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. నాలుగు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కానున్నది.
Chandrababu Naidu: ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి జ్యూరిచ్ వెళ్లనున్నారు. అక్కడ భారత రాయబారితో చంద్రబాబు భేటీ కానున్నారు. జ్యూరిచ్‌లో ముందస్తు ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు హిల్టన్ హోటల్, హోటల్ హయత్‌లో తెలుగు, ఇతర విదేశీ పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్సోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల కోసం చర్చిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు.
Chandrababu Naidu: ఆ తర్వత దావోస్‌కు వెళ్లనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను సాధించే దిశగా ఆయన పర్యటన కొనసాగనున్నది. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు పాల్గొనే ఆ ఆర్థిక సదస్సులో పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరపనున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వారిని ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి లోకేశ్, పరిశ్రమల వాఖ మంత్రి టీజీ భరత్‌తోపాటు అధికారులు ఉంటారు.
Chandrababu Naidu: దావోస్‌లో తొలిరోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో సమావేశం కానున్నారు. రెండోరోజున గ్రీన్ హైడ్రోజన్ అంశంపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ చైర్మన్లు, సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు.