Psycho Killer: ఒక్కోసారి ఎంత పెద్ద.. తెలివైన నేరస్థుడు అయినా.. చిన్న తప్పిదంతో దొరికిపోతాడు. అందుకే పోలీసులు నేరస్థుల విషయంలో వారి బలహీనతలు తెలుసుకుని.. పట్టుకోవడానికి పన్నాగాలు పన్నుతారు. కాస్త ఆలస్యం కావచ్చు కానీ.. పోలీసుల నుంచి తప్పించుకోవడం మాత్రం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఇలానే ఒక సైకో పోలీసులకు దొరికాడు.
ఢిల్లీలో 2006-2007 మధ్యలో వరుసగా హత్యలు చేస్తూపోయాడు చంద్రకాంత్ ఝా అనే సైకో కిల్లర్. చంపిన తరువాత మృత దేహాలను ఛిద్రం చేసి.. అక్కడే మందు తాగి మాంసం తిని హంగామా చేసేవాడు. ఎంత క్రూరుడు అంటే.. ఒకసారి ఏకంగా ఒకరిని చంపేసి.. తీహార్ జైలు ముందు మృతదేహాన్ని ఛిద్రం చేసి పోలీసులకు తనను పట్టుకోమని ఛాలెంజ్ విసిరాడు.
మరి పోలీసులు ఊరుకుంటారా? గట్టి నిఘా పెట్టారు. వెతుకులాట తీవ్రం చేశారు. దీంతో ఈ సైకో కిల్లర్ దొరికాడు. దుర్మార్గుడిని జైల్లో పెట్టారు. జైలు జీవితం గడుపుతున్న చంద్రకాంత్.. 2023 ఆగస్టులో తన కూతురు పెళ్లి కోసం అని పెరోల్ పై బయటకు వచ్చాడు. నవంబర్ లో తిరిగి అతను జైలుకు వెళ్లాల్సి ఉంది. కానీ, మాయం అయిపోయాడు.
ఇది కూడా చదవండి: Donald Trump: జిన్‌పింగ్‌కు ట్రంప్ ఫోన్.. ప్రమాణస్వీకారం తర్వాత ఇండియాకు ట్రంప్
Psycho Killer: పోలీసులను తప్పించుకుని 17 నెలల పాటు దాక్కున్నాడు. పోలీసులు అతనిపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ప్రకటించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. కానీ, పోలీసులు పట్టు వదలలేదు. కచ్చితంగా అతను ఎదో ఒకరోజు తన భార్యను కలుసుకోవడానికి వెళ్తాడు అని ఊహించారు. ఆ దిశలో నిఘా పెట్టారు. ఆఖరుకు ఒక రోజు అయ్యగారు రాత్రి ఎవరూ లేని సమయంలో అలీపూర్ ప్రాంతానికి వెళ్లి భార్య వద్దకు వెళ్లాడు. ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ సైకో కిల్లర్ ను అదుపులోకి తీసుకుని మళ్ళీ కటకటాల వెనుకకు నెట్టారు.
చంద్రకాంత్ ఝా పరారీలో ఉన్నపుడు తన వేషాన్ని పూర్తిగా మార్చేశాడు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రార్ధనా స్థలాల వద్ద తిరుగాడుతూ.. అక్కడి భక్తులు ఇచ్చిన ఆహరం తింటూ జీవించాడని, ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గరలో తమకు చిక్కాడని పోలీసులు తెలిపారు.