Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ వేదికగా ఘనంగా నిర్వహించిన యోగాంధ్ర – 2025 కార్యక్రమంపై విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా అయిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
“రూ. వందల కోట్ల ఖర్చు చేసినవాళ్లే ఇప్పుడు పాఠాలు చెబుతున్నారు!”
చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ, “ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయడం అత్యంత బాధాకరం. రుషికొండ ప్యాలెస్‌కు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినవాళ్లు ఇప్పుడు యోగాంధ్రపై విమర్శలు చేయడం చూస్తుంటే అసహ్యం కలుగుతోంది,” అని అన్నారు.
యోగాంధ్ర ఖర్చు – కేంద్ర ప్రభుత్వం మద్దతుతో:
ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్లు మంజూరయ్యాయని స్పష్టంచేశారు. అంతర్జాతీయ స్థాయిలో యోగా ప్రాధాన్యతను చాటేలా తీసుకున్న ఈ మాసివ్ ఈవెంట్‌ను రాజకీయ విమర్శలతో కలుషితం చేయాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన
“భూతాన్ని నియంత్రించాలి – ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి”
జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ, చంద్రబాబు ప్రజలకు సందేశమిస్తూ – ‘‘ప్రజల చైతన్యం ద్వారానే అబద్ధపు ప్రచారాల్ని నిలిపివేయగలము. భూతాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలి’’ అన్నారు.
నిజానికి యోగాంధ్ర ఏపీ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటింది:
3.20 లక్షల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు దిశగా అడుగులు వేసింది. ప్రధానమంత్రి మోదీ, పలువురు ప్రముఖుల సాక్షిగా జరిగిన ఈ సమారోహం రాష్ట్రాన్ని ఖ్యాతికెక్కించింది.