Ramoji Rao Death Anniversary: ఈనాడు అధినేత రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య శిఖరాలకు చేరిన అక్షర యోధుడని, పత్రికా రంగాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన ఆదర్శవాది అని చంద్రబాబు కొనియాడగా.. ఈనాడు, రామోజీ ఫిలిం సిటీల ద్వారా తెలుగుజాతి కీర్తిని పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని లోకేశ్ స్మరించుకున్నారు.
మరింత Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!Category: News
Revanth Reddy: ప్రాజెక్టులు తెస్తే గండపెండేరం తొడుగుతాం.. లేదంటే 15 తర్వాత నీ సంగతి చెప్తాం
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకువస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి తానే స్వయంగా గండపెండేరం తొడుగుతానని, లేదంటే జూన్ 15 తర్వాత ఆయన సంగతి చెప్తానని సీఎం హెచ్చరించారు.
మరింత Revanth Reddy: ప్రాజెక్టులు తెస్తే గండపెండేరం తొడుగుతాం.. లేదంటే 15 తర్వాత నీ సంగతి చెప్తాంMK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
MK Stalin: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మరో మూడు నెలలైనా నిలబడుతుందా? అని డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయని, ఆరు నెలల వరకు మాట్లాడనన్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల ముందే స్పందించాల్సి వస్తోందన్నారు. అలాగే ప్రత్యర్థి తోటలోని మల్లెపూవు కూడా సువాసన ఇస్తుందన్న అన్నాదురై మాటలను గుర్తు చేస్తూ.. పాత పార్టీలపై అనవసర విమర్శలు చేయవద్దని కొత్తగా చేరిన కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు.
మరింత MK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘పొలిమేర’ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదని, తాను రేవంత్ లాగా పది పార్టీలు మారలేదని ఎద్దేవా చేశారు. తాను పుట్టింది, చచ్చేది బీజేపీలోనే అని స్పష్టం చేశారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడటానికి తాను కేసీఆర్‌ని కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు.
మరింత Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదుSummer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!
Summer Holidays: తెలంగాణలో జూన్ 12న తెరుచుకోవాల్సిన పాఠశాలలు, జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) సెలవులు కావడంతో జూన్ 15కు వాయిదా పడ్డాయి. ఈ సెలవులను భర్తీ చేయడానికి జులై 11 రెండో శనివారాన్ని పనిదినంగా విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఎండల తీవ్రత కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు కూడా జూన్ 15 నుంచే పున:ప్రారంభం కానున్నాయి.
మరింత Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!Hyderabad: 2 రోజుల పాటు నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కార్లకు గృహకల్ప, గగన్‌విహార్ ల వద్ద.. బైకులకు మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ కేటాయించారు. బస్సులు, వ్యాన్ల ప్రయాణికులు గాంధీభవన్ వద్ద దిగాల్సి ఉంటుంది. ఆటోలకు షెజాన్ హోటల్ వద్ద డ్రాపింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు.
మరింత Hyderabad: 2 రోజుల పాటు నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కావేరి-గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత హరీశ్ Harish Rao: రావు ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడి కళ్లల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను ‘గురుదక్షిణ’గా ఇస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుండి నీటిని మళ్లించాలన్న గత బీఆర్ఎస్ ప్రతిపాదనలను కాదని, పోలవరం నుండి నీటిని తరలిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు.
మరింత Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందిFuture City: వారంలో ఒకరోజు ‘ఫ్యూచర్ సిటీ’ నుంచే సీఎం రేవంత్ పాలన
Future City: తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీలోని ఎఫ్‌సీడీఏ (FCDA) భవనం నుండి ఆయన పాలన సాగిస్తారు. ఈ భవనంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, ఐటీ, పరిశ్రమల శాఖల కీలక చర్చలన్నీ ఇకపై ఇక్కడే జరగనున్నాయి. ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేయనున్నారు.
మరింత Future City: వారంలో ఒకరోజు ‘ఫ్యూచర్ సిటీ’ నుంచే సీఎం రేవంత్ పాలనRevanth Reddy: దేశవ్యాప్తంగా ‘హైడ్రా’ డిమాండ్.. ‘ఈగల్ ఫోర్స్’ కూడా సూపర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ‘హైడ్రా’ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని విప్పారు. జర్మనీ నియంత Revanth Reddy: హిట్లర్ యొక్క హంతక ముఠా పేరే హైడ్రా అని, ఆక్రమణదారుల్లో భయం పుట్టించడానికే ఈ పేరు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో 3,000 మందితో ఈ సంస్థ పనిచేస్తోందని, డ్రగ్స్ నివారణకు తెచ్చిన ‘ఈగల్ ఫోర్స్’తో కలిపి ఈ రెండు వ్యవస్థలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని సీఎం పేర్కొన్నారు.
మరింత Revanth Reddy: దేశవ్యాప్తంగా ‘హైడ్రా’ డిమాండ్.. ‘ఈగల్ ఫోర్స్’ కూడా సూపర్!Annamalai: అన్నామలై పొలిటికల్ మోడల్ ఎందుకు హిట్టయింది?
Annamalai: తమిళనాడులో ఒక రాజకీయ శూన్యత ఉందన్న అన్నామలై జోస్యం నిజమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని ద్రావిడ పార్టీల 60 ఏళ్ల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. అన్నామలై ప్రతిపాదించిన థర్డ్ స్పేస్ వ్యూహాన్నే విజయ్ కొద్దిపాటి మార్పులతో విజయవంతంగా అమలు చేసి సీఎం అయ్యారు. ప్రస్తుతం బీజేపీని వీడిన అన్నామలై.. ‘AMI’ ఉద్యమం ద్వారా సొంతంగా సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మరింత Annamalai: అన్నామలై పొలిటికల్ మోడల్ ఎందుకు హిట్టయింది?