Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ భార్య రితిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్, రితిక జంటకు తొలి సంతానంగా కుమార్తె కలగగా ఇప్పుడు రెండో సంతానంతో ఉత్సాహంగా ఉన్నారు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతుండడంతోనే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడేందుకు జట్టుతో పాటు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా కు వెళ్లకుండా ఆగిపోయాడు. ఇందుకోసమే అతను ఈ నెల 22న ఆరంభమయ్యే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమవుతాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారమే రితిక ప్రసవం జరగడం..తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండడంతో రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్నట్లు జరిగితే రోహిత్ తో పాటు టీమిండియాకు కూడా ఇది గుడ్ న్యూస్ అవుతుంది.