Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా ఆయన బ్రిటన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నుంచి రాజకీయ కోణంలో అనుమతి (Political Clearance) లభించకపోవడంతో పర్యటనకు బ్రేక్ పడింది.
-
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి అనేవి రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతాను. మన పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపడం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలను మన తెలంగాణ గడ్డపైకి, హైదరాబాద్‌కు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ లక్ష్యంతో సాగుతున్న ‘తెలంగాణ రైజింగ్’ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు” అని స్పష్టం చేశారు.
-
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: ఒక సాధారణ భారతీయ విద్యార్థి కూడా హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల సర్టిఫికెట్లు పొందేలా వ్యవస్థను నిర్మిస్తామని చెప్పారు.
అమెరికాకు అధికారుల బృందం – కీలక ఒప్పందాలు యథాతథం
-
టాప్ వర్సిటీలతో భాగస్వామ్యం: హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు (MoUs) పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
-
లండన్‌లో ముమ్మర సమావేశాలు: బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, కేంబ్రిడ్జ్ ప్రతినిధులు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ బృందాలతో సీఎం సమావేశాలు కొనసాగనున్నారు. అలాగే ప్రముఖ స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతోనూ చర్చలు జరపనున్నారు.
