Bus Accident: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు గుండెపోటుతో ప్రాణాలిడిచాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు సూర్యాపేటలో చికిత్స జరుపుతున్నారు. ఈ రహదారిపై రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
Bus Accident: గుంటూరుకు చెందిన రెండు ట్రావెల్స్ బస్సులు అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనతో ఒక్క సారిగా క్లీనర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా, అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Bus Accident: హఠాత్తుగా జరిగిన ఘటనతో మరో ప్రయాణికుడు గుండెపోటుతో స్పాట్‌లోనే కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు సాయి, రసూల్ అని, వారిద్దరూ గుంటూరు వాసులని పోలీసులు పేర్కొన్నారు.