Bunny Vasu: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ ఏడాది వరుస చిన్న సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాల తర్వాత, ఈ ఏడాది చివర్లో ‘ఈషా’ అనే చిన్న సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ప్రాజెక్టుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అట్లీ మూవీ తర్వాతే త్రివిక్రమ్ సినిమా?
నిజానికి ‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల బన్నీ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు అట్లీతో (#AA22) అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పాడుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, త్రివిక్రమ్ గతంలో బన్నీ కోసం అనుకున్న కథను ఎన్టీఆర్‌కు వినిపించి ఒప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కొంచెం సెన్సిటీవ్ టాపిక్ ఇది… #BunnyVas on #AlluArjun, #Trivikram Combo Movie ! pic.twitter.com/Mk5BP2LSGL
— Rajesh Manne (@rajeshmanne1) December 24, 2025
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోపై సస్పెన్స్
ఎన్టీఆర్ గతంలో కొన్ని సందర్భాల్లో ‘సుబ్రమణ్య స్వామి’ పుస్తకం పట్టుకుని కనిపించడంతో, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నిజమేనని అభిమానులు భావించారు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సైతం త్వరలోనే వీరి కాంబోపై అనౌన్స్‌మెంట్ వీడియో ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ, అనూహ్యంగా త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అనౌన్స్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వాయిదా పడిందని అందరూ అనుకున్నారు.
ఇది కూడా చదవండి: Danam Nagender: నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
బన్నీ వాసు అసలు ఏం చెప్పారు?
తాజా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయ్యిందట కదా? అని అడిగిన ప్రశ్నకు బన్నీ వాసు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
సిన్మా లేదని నేను చెప్పడం లేదు.. అలా అని ఇప్పుడే ఉందని కూడా అనడం లేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది, అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి” అని పేర్కొన్నారు.
బన్నీ వాసు మాటలతో ఈ క్రేజీ కాంబినేషన్ ఇంకా లైన్లోనే ఉందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే త్రివిక్రమ్ అదే కథను ఎన్టీఆర్‌తో చేస్తారా? లేక బన్నీ కోసం మరో కొత్త కథను సిద్ధం చేశారా? అన్నది వేచి చూడాలి.
జనవరిలో డబుల్ ధమాకా
వచ్చే ఏడాది జనవరిలో అల్లు అర్జున్ తన రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వనున్నారు.
-
మొదటి సినిమా: జూలై/ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుంది.
-
రెండూ ప్రాజెక్ట్: మార్చి 2027లో పట్టాలెక్కనుంది. ఈ రెండింటిలో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
