Monalisa Bhonsle

Monalisa Bhonsle: మొనాలిసాకు బంపర్ ఆఫర్.. బాలీవుడ్ సినిమాలో ఛాన్స్!

Monalisa Bhonsle: ఒక్కరాత్రిలో అదృష్టం మారిపోవడం అనే మాట వింటూంటాం. ఒక్కోసారి అటువంటి సంఘటనలు చూస్తుంటాం కూడా. అటువంటి సంఘటనలు చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక లాటరీ తగలడమో.. ఏదైనా టాలెంట్ అకస్మాత్తుగా ప్రజల్లోకి వెళ్లిపోవడమో.. లేకపోతే ఎవరైనా నటుడు.. నటి సినిమా ఒకటి సూపర్ హిట్ కావడమో ఇలా ఏదైనా జరిగినపుడు వాళ్ళు ఒక్కసారిగా దూసుకుపోవడం మనం చాలా సందర్భాల్లో చూశాం. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాకా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నాయి. సరిగ్గా అలాంటిదే ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇటీవల కాలంలో మోనాలిసా పేరు మోగిపోతోంది.

కోట్లాది మంది భక్త జనం పుణ్య స్నానాల కోసం ఒక్క చోటకు చేరిన మహా కుంభమేళా. దానిని తన వీక్షకులకు చూపించడం కోసం ఒక యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ కంటికి ఒక మెరుపు కనిపించింది. రుద్రాక్ష పూసలను అమ్ముకుంటున్న ఒక ముగ్ధ కనిపించింది. కెమెరా కంటికి అందంగా ఏదైనా కనిపిస్తే వెంటనే దానిని క్యాప్చర్ చేసేస్తుంది కదా.. అలా ఆ ఇన్ఫ్లూయెన్సర్ కెమెరా ఆ అందాన్ని బంధించింది. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు ఆ ఇన్ఫ్లూయెన్సర్. అదే మహా కుంభ్ మోనాలిసాగా వైరల్ అయిపొయింది.

సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు.. వీడియోలు చూసిన అందరూ ఆమె అందానికి ఫిదా అయిపోయారు. చెంపకు చారెడు కళ్ళు అని కవులు వర్ణించిన విధంగా ఉన్న ఆమె కళ్ళకు సోషల్ మీడియాలో స్పెషల్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. ఇక కుంభమేళాకు వెళుతూన్న వారికి ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపొయింది. ఎంతలా అంటే, స్నానం చేసిన తరువాత దేవుని దర్శనం అయిపోయాకా.. చాలామంది మోనాలిసా ను చూడటం కోసం వెళ్లి ఆమెతో సెల్ఫీలు దిగడం వరకూ పరిస్థితి మారిపోయింది. దీంతో ఒక సందర్భంలో ఆమెను జనాల నుంచి కాపాడుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయాయి.

ఇది కూడా చదవండి: Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి..

Monalisa Bhonsle: ఇదిలా ఉంచితే ఇప్పుడు ఆమె సినీ ప్రముఖులను ఆకర్షించింది. టాలీవుడ్ నుంచి దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ తాజా సినిమాకి దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు ఆమెను సినిమాల్లోకి తీసుకుంటున్నారని వార్తలు వెల్లువెత్తాయి. వాటిని సంబంధిత వర్గాలు నిర్ధారించకపోయినా.. ఖండించక పోవడం కూడా విశేషం. అయితే, ఇప్పుడు ఏకంగా ఆమెకు బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్నీ బాలీవుడ్ దర్శకుడే ప్రకటించారు.

ALSO READ  Gujarat Tourism: గుజరాత్ కు టూరిస్టుల తాకిడి.. లక్షల్లో పర్యాటకులు

ఈ తేనె కళ్ళ సుందరి మోనాలిసాకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీని రూపొందిస్తున్న సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ తన సినిమాలో ఒక పాత్ర కోసం మోనాలీసాను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. ఆమెకు నటన రాదు కాబట్టి ట్రైనింగ్ ఇప్పించి మరీ తన సినిమాలో యాక్ట్ చేయించుకుంటానని చెబుతున్నారీయన. ఒక రైతు కూతురు పాత్ర కోసం ఆమె సరిగ్గా సరిపోతుందంటూ ఆ డైరెక్టర్ సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో “మోనాలిసా అమాయకపపు లుక్ కు నేను ఫిదా అయ్యాను. నేను ఆమెకు నా మూవీ ‘డైరీ ఆఫ్ మణిపూర్’లో అవకాశం ఇస్తున్నాను” అంటూ ప్రకటించారు.

ఆయన చేసిన పోస్ట్ ఇక్కడ చూడొచ్చు..

Monalisa Bhonsle: అదండీ విషయం.. టైము బాగుంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మట్టిలో మాణిక్యంలా ఎక్కడో రుద్రాక్ష పూసలు అమ్ముకునే అమ్మాయి.. మొదటిసరిగా కుంభమేళాలో తన వ్యాపారం చేసుకోవాలని అనుకోవడం ఏమిటి.. ఆమె అందమైన కళ్ళు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఏమిటీ.. ఏకంగా బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ రావడం ఏమిటీ.. ఇదంతా కాలమహిమ అనుకోవాలి అంతేకదూ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *