BJP: బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ… ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఏంటో వారి కార్యకర్తల బలమెంటో మరోసారి 2024 ఎన్నికల్లో చూపించింది. కేంద్రంలో ఎన్ని సార్లు బీజేపీ అధికారంలో ఉన్న ఏపీలో పార్టీ పరిస్థితి మాత్రం ఎప్పుడూ అంత మాత్రంగానే ఉండేది. కారణం ఇక్కడ స్థానిక పార్టీలకు ప్రజలు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. జాతీయ పార్టీల ప్రభావం ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టే విధంగా ఎప్పుడు లేదు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్రంలో మరొక జాతీయ పార్టీ ఆ స్థాయిలో ప్రభావితం చూపించలేకపోయింది.ఆ ప్రయత్నం బీజేపీ ఇప్పటివరకు ఆ స్థాయిలో చేస్తూనే వచ్చింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుగా ఏర్పడి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి పరాజ్యమైనప్పటికీ మళ్లీ తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం చేయాలని కేంద్ర నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచించినట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం నుంచి ఇప్పటికే వరాల జల్లు కురిసింది. ఇప్పటికే ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కేటాయించిన బడ్జెట్ అందరిని ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం ఏ స్థాయిలో ఉంటుందనేది చూపించింది. ఇది రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనుకుంటున్న బీజేపీకి బాగా సహాయపడుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Collector Anand: రూల్స్ బ్రేక్ చేస్తే తగ్గేదేలేదు.. కలెక్టర్ ఆనంద్ మార్క్ పాలన
BJP: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు ఏపీకి ఊరట కలిగించాయి. ఇప్పటికే అటు పారిశ్రామిక వేత్తలందరూ కూడా అభిప్రాయపడ్డారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాల ప్రగతి చేయూత, పారిశ్రామిక నడవాగా సహకారం తదితర నిర్ణయాల ద్వారా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల మధ్య మంచి సహకారం ఉందనే సంకేతాన్ని ఇప్పటికే కేంద్రం తెలియచేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు కాయల పరిశ్రమలు తిరిగి తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు అనువైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చేలా బడ్జెట్ తెలియజేసింది. ఆక్వా రంగంలో పన్నులు రాయితీ వల్ల పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది.
నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ అవకాశాలు అనేక విధాలుగా కేంద్ర బడ్జెట్‌లో ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించడమే కాకుండా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. ఏపీలో బీజేపీ బలోపేతానికి బీజాలు పడినట్లేని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ కోసం అవసరమైన నిధులు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల ఉపాధి అవకాశాలు రావడానికి బడ్జెట్ సహాయపడుతుందని భావిస్తుంది.
ఏపీలో ఇప్పటికే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇటు అన్ని ప్రాంతాల్లోను ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు రాయలసీమ, కోస్తాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి జిల్లాకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికే గెలిచిన వారంతా కూడా బీజేపీ సంబంధించిన సీనియర్ నేతలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభివృద్ధి చెందాలనే దానిపైన కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులతో మంతనాలు సైతం జరిపినట్లు తెలుస్తుంది. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి … పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. పార్టీ విధివిధానాలు ఇప్పటికే సభ్యత్వాలు నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుంది. కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించడం మే కాకుండా పార్టీని ప్రజల దగ్గరకు చేరువ చేసే విధానాలను బీజేపీ అవలంబిస్తుంది.