Bibek Debroy: ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా ఉన్న వివేక్ దేబ్రాయ్ నవంబర్ 1న కన్నుమూశారు. ఆయనకు 69 ఏళ్లు. నీతి ఆయోగ్‌లో తొలి సభ్యుల్లో ఒకరైన ఆయన 2019 వరకు అందులోనే ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దేబ్రాయ్ నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన కొత్త తరం కోసం అన్ని పురాణాలను ఆంగ్లంలోకి సులభంగా అనువదించాడు. 2017 నుంచి ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1955లో మేఘాలయలో వివేక్ దేవరాయ్ జనమించారు. కొన్నాళ్ల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. వైద్యుల పర్యవేక్షలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Amit Shah: గుజరాత్ లో అతిపెద్ద ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్
వివేక్ దేబ్రాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. “డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత మొదలైనవాటిలో బాగా ప్రావీణ్యం సంపాదించారు. భారతదేశంలోని మేధో ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ప్రజా విధానానికి సహకరించడమే కాకుండా, మన ప్రాచీన గ్రంథాలతో పని చేయడం లో ఆయన చాలా ఆనందం పొందేవారు” అని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
I have known Dr. Debroy for many years. I will fondly remember his insights and passion for academic discourse. Saddened by his passing away. Condolences to his family and friends. Om Shanti. pic.twitter.com/TyETOOwOoY
— Narendra Modi (@narendramodi) November 1, 2024