Bengaluru: బెంగళూరులో ఏఐ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. తన భార్య, అత్తగారు డబ్బు కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబరు 9న, అతను 1:20 గంటల వీడియోను, 24 పేజీల లేఖను విడుదల చేశాడు. అందులో తనకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ వాపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన ఓ న్యాయమూర్తిపై కూడా అతుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసును కొట్టివేసే పేరుతో న్యాయమూర్తి రూ.5 లక్షలు అడిగారని ఆయన లేఖలో రాశారు. ఆత్మహత్య చేసుకోవాలని భార్య, అత్త కూడా తనను కోరారని అతుల్ తన లేఖలో పేర్కొన్నాడు.
బీహార్‌కు చెందిన అతుల్ సుభాష్ మృతదేహాన్ని బెంగళూరులోని మంజునాథ్ లేఅవుట్‌లోని అతని ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా వేలాడుతూ శవం కనిపించింది. ఆ గదిలో ‘జస్టిస్ ఈజ్ డ్యూ’ అని రాసి ఉన్న ప్లకార్డు కనిపించింది. అతుల్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతుల్ భార్య, అతని భార్య కుటుంబసభ్యులపై ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్టు కేసు నమోదు చేశారు.
అతుల్ సుభాష్ 24 పేజీల లేఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాశారు. ఇందులో దేశంలోని నేర న్యాయ వ్యవస్థలోని లోపాలను గురించి రాస్తూ పురుషులపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి గురించి ప్రస్తావించారు. తన భార్య పెట్టిన కేసులన్నింటికీ తాను నిర్దోషినని వేడుకుంటున్నట్లు మరో నోట్‌లో రాశాడు. వీటిలో వరకట్న నిరోధక చట్టం, మహిళలపై అఘాయిత్యాల కేసులు ఉన్నాయి. ఈ తప్పుడు కేసుల్లో నా తల్లిదండ్రులను, సోదరుడిని వేధించడం మానేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నాను అంటూ ఆ లేఖలో కోరాడు.
ఇది కూడా చదవండి:Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ విలాసవంతమైన బంగ్లా.. బీజేపీ విమర్శల దాడి
వీడియోలో వివరణ..
Bengaluru: ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోలో అతుల్ మొత్తం పరిస్థితిని వివరించాడు. ఆ వీడియో ప్రకారం.. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మ్యాచ్‌ని కలుసుకున్న తర్వాత 2019లో తాము పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. మరుసటి సంవత్సరం వారికి ఒక కుమారుడు జన్మించాడు. తన భార్య, భార్య కుటుంబీకులు నిత్యం తన నుంచి డబ్బులు డిమాండ్ చేసేవారని, అది తీర్చేవాడినని చెప్పాడు. అతను తన భార్య కుటుంబానికి లక్షల రూపాయలు ఇచ్చాడు. కానీ అతను డబ్బు ఇవ్వడం మానేయడంతో, భార్య 2021 లో వారి కొడుకుతో బెంగళూరు వెళ్లిపోయింది.
ప్రతి నెలా రూ.40 వేలు మెయింటెనెన్స్ ఇచ్చేవాడిననీ, కానీ ఇప్పుడు బిడ్డ పోషణ కోసం నెలకు రూ.2-4 లక్షలు డిమాండ్ చేస్తోందని అతుల్ వీడియోలో చెప్పాడు. నా భార్య నన్ను నా కొడుకుని కలవనివ్వదు, అతనితో మాట్లాడనివ్వదు అని అతుల్ బాధగా వివరించాడు. పూజ అయినా, ఏ పెళ్లి అయినా నికిత ప్రతిసారీ కనీసం 6 చీరలు, ఒక బంగారం సెట్ అడిగేది. మా అత్తగారికి రూ.20 లక్షలు ఇచ్చాను.
@elonmusk @realDonaldTrump @DonaldJTrumpJr @TeamTrump I will be dead when you will read this. A legal genocide of men happening in India currently.
— Atul Subhash (@AtulSubhas19131) December 8, 2024
వరకట్నం, తండ్రి హత్య ఆరోపణలపై భార్య కేసు..
Bengaluru: మరుసటి సంవత్సరం, అతుల్, అతని కుటుంబ సభ్యులపై అతని భార్య అనేక కేసులు పెట్టింది. వీటిలో హత్య, అసహజ సెక్స్ కేసులు ఉన్నాయి. 10 లక్షల కట్నం డిమాండ్ చేశారనీ, అందుకే తన తండ్రి గుండెపోటుతో చనిపోయాడని భార్య ఆరోపించిందని అతుల్ చెప్పాడు.
నిజానికి ఆమె తండ్రి చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, గత 10 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారని అతుల్ తెలిపాడు. ఈ విషయాన్ని తన భార్య ఇప్పటికే కోర్టులో అంగీకరించిందని, ఈ ఆరోపణ ఓ సినిమా బ్యాడ్ స్టోరీ లాంటిదని అతుల్ అన్నారు. అనారోగ్య సమస్యలు, మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు అతనికి బ్రతకడానికి కొన్ని నెలలు మాత్రమే అవకాశం ఉందన్నారు. అందుకే మేము తొందరపడి పెళ్లి చేసుకున్నాము అంటూ అతుల్ చెప్పుకొచ్చాడు.
మూడు కోట్లు కావాలి.. నువ్వు ఆత్మహత్య చేసుకో..
Bengaluru: ఈ కేసును సెటిల్ చేసేందుకు థన్ భార్య మొదట కోటి డిమాండ్ చేసిందని, తర్వాత దాన్ని రూ.3 కోట్లకు పెంచారని అతుల్ తెలిపాడు. 3 కోట్ల డిమాండ్ గురించి జౌన్‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తికి చెప్పినప్పుడు, ఆయన కూడా తన భార్యకు మద్దతు ఇచ్చాడని అతను చెప్పాడు.
దేశంలో చాలా మంది పురుషులు తప్పుడు కేసుల వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదికలు చెబుతున్నాయని నేను న్యాయమూర్తికి చెప్పానని అతుల్ చెప్పగా, నువ్వు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదని భార్య అడ్డుకుందని తెలిపాడు. దీనికి న్యాయమూర్తి నవ్వుతూ.. ఈ కేసులు అబద్ధమని, కుటుంబం గురించి ఆలోచించి కేసును పరిష్కరించుకోవాలని అన్నారు. కేసు సెటిల్ చేసేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తన చివరి వీడియోలో అతుల్ ఆరోపించాడు.
అతుల్ చివరి కోరిక
Bengaluru: అతుల్ తన చివరి కోరికగా లేఖలో ఇలా పేర్కొన్నాడు.. “నా కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. నా భార్య నా మృతదేహాన్ని తాకకూడదు. నన్ను చిత్రహింసలకు గురిచేసిన వారికి శిక్ష పడితే తప్ప, నా అస్థికలను నిమజ్జనం చేయకూడదు. అవినీతిపరుడైన జడ్జి నా భార్యను, ఆమె కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటిస్తే, నా బూడిదను అదే కోర్టు బయట కాలువలో వేయాలి. నా కొడుకు బాధ్యతను నా తల్లిదండ్రులకే అప్పగించాలి.